Y.S. Sharmila: అందువల్లే కేంద్ర అన్యాయం చేస్తుంది : వైఎస్ షర్మిల
బీజేపీతో తెలుగుదేశం, జనసేన పార్టీలు జట్టుకట్టగా జగన్ (Jagan) అక్రమ పొత్తు పెట్టుకున్నారని, అందువల్లే కేంద్రం అన్యాయం చేస్తున్నా ఆయన నోరు మెదపడం లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y.S. Sharmila) మండిపడ్డారు. ఉపాధిహామీ పరిరక్షణ యాత్రలో భాగగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టానికి ఎన్డీయే (NDA) ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ప్రశ్నించే పరిస్థితి లేదని, ప్రతిపక్ష పార్టీ నేత జగన్ కూడా స్పందించలేదన్నారు. ప్రజలు కష్టాలు పడుతున్నా జగన్ పట్టించుకోరుగానీ, వారి పార్టీ నేతలకు ఇబ్బందులొస్తే బల ప్రదర్శనలతో ఓదార్చుతుంటారని విమర్శించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇవి కూడా చదవండి








