నీ కుటుంబ చరిత్ర నీకు తెలుసా? లోకేశ్‌కు వైసీపీ ఘాటు కౌంటర్!
YCP: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని దూరం పెట్టారంటూ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. లోకేశ్ విమర్శలకు ప్రతిగా ఆయన కుటుంబంలోని గత పరిణామాలను ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడే ముందు తన సొంత కుటుంబ వ్యవహారాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికింది.
మీ బాబాయ్‌ను ఎందుకు గొలుసులతో కట్టేశారు..
“నీ మేనత్తలు ఎవరో నీకు గుర్తున్నారా? వారిని ఎప్పుడైనా ఇంటికి పిలిచి కనీసం అన్నం పెట్టావా?” అంటూ వైసీపీ నేతలు లోకేశ్‌ను ప్రశ్నించారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడి ప్రస్తావన తెస్తూ.. “మీ బాబాయ్‌ను ఎందుకు గొలుసులతో కట్టేశారో సమాధానం చెప్పగలవా?” అని నిలదీశారు. అంతేకాకుండా, లోకేశ్ నానమ్మ మరణించిన సమయంలో చంద్రబాబు నాయుడు తలకొరివి కూడా పెట్టలేదని ఆరోపిస్తూ వైసీపీ విమర్శలు గుప్పించింది.
హద్దులు దాటవద్దు..
రాజకీయ విమర్శలు చేసే క్రమంలో హద్దులు దాటవద్దని వైసీపీ హెచ్చరించింది. “నువ్వు ఒక మాట అంటే.. మేము పది మాటలు అనగలమని గుర్తుంచుకో. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే నీకే మంచిది” అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. వ్యక్తిగత విమర్శలకు దిగితే తమ దగ్గర కూడా గట్టి సమాధానాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి








