ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్ల (Municipal Commissioners)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ (S. Suresh Kumar) ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సుమారు 16 మంది అధికారులను బదిలీ చేసినట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించారు.
ప్రస్తుతం విజయవాడ జోనల్ కమిషనర్ గా ఉన్న రమ్య కీర్తన (Ramya Keerthana)ను నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. దర్శి మున్సిపల్ కమిషనర్ గా అర్జున రావు, పులివెందుల మున్సిపల్ కమిషనర్ గా మునిరావు, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ గా సుభాష్ చంద్రబోస్, తెనాలి మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ గా రామారావు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సౌత్ జోనల్ కమిషనర్ గా ప్రసాదరావు (Prasada Rao,), గుంటూరు మున్సిపాలిటీ అడిషనల్ కమిషనర్ గా మల్లయ్యనాయుడు, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గా జి. శ్రీనివాస్, యేలేశ్వరం మున్సిపల్ కమిషనర్ గా జ్ఞానప్రకాష్, ఆత్మకూరు కె మున్సిపల్ కమిషనర్ గాఎస్ బేబీ, హిందూపురం అసిస్టెంట్ కమిషనర్ గా డిప్యుటేషన్ పై క్రాంతికుమార్, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ గా భవానీ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి








