Minister Lokesh : రెవెన్యూ విషయాల్లోనూ ఎమ్మెల్యేల జోక్యం వద్దు : మంత్రి లోకేశ్
ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాలో ఎమ్మెల్యేల పాత్రను ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan) లో నిర్వహించిన టీడీపీ ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. రెవెన్యూ విషయాల్లోనూ ఎమ్మెల్యేలు (MLAs) జోక్యం చేసుకోవద్దన్నారు. పార్టీయే సుప్రీం అని, పార్టీ బీ ఫామ్ ఇస్తేనే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న సంగతిని అందరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి (Development) కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూలత ఉన్నా, ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి నష్టం జరుగుతుంటే ఉపేక్షించేందుకు అధినేత సిద్ధంగా లేరని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








