AP High Court: ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ లీసా గిల్, ప్రస్తుతం ఏపీ హైకోర్టులో రెండో అత్యున్నత స్థానంలో కొనసాగుతారు.
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నూతన విధానపరమైన నిర్ణయం ప్రకారం, కాబోయే సీజే కోర్టు వ్యవహారాలపై ముందే అవగాహన పెంచుకోవడానికి వీలుగా రెండు నెలల ముందే బదిలీ అయ్యారు. జస్టిస్ ఠాకూర్ రిటైర్మెంట్ తర్వాత, జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు. తద్వారా ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి








