HIV Cases: తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవీ కలవరం.. పెరుగుతున్న మరణాలు!
తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవీ (HIV Cases) మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో గత ఐదేళ్లుగా కేసుల సంఖ్య, మరణాలు క్రమంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. హెచ్ఐవీ మరణాల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. 2024లో రాష్ట్రంలో ఏకంగా 3,035 మంది ఈ వ్యాధితో మరణించారు.
తెలంగాణలో ప్రస్తుతం 1.25 లక్షల మంది హెచ్ఐవీ (HIV Cases) బాధితులు ఉన్నారు. 2020లో 1.06 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య, 2024-25 నాటికి 1.25 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య కూడా 2020లో 1,523 ఉండగా, 2024 నాటికి రెట్టింపై 3,035కి చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా హెచ్ఐవీ బాధితుల సంఖ్యలో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మొత్తం బాధితుల (HIV Cases) సంఖ్య (2.76 లక్షలు) ఎక్కువగా ఉన్నప్పటికీ, గత ఐదేళ్లతో పోలిస్తే మరణాల రేటు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఏపీలో 2020లో 7 వేలకు పైగా మరణాలు ఉండగా, 2024 నాటికి ఆ సంఖ్య 4,364కి తగ్గింది. కాగా, మహారాష్ట్ర 3.68 లక్షల కేసులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో కొనసాగుతోంది.






