Chandrababu: బీసీ రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీ (BC)లకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. డెడికేటెడ్ కమిషన్ (Dedicated Commission) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వారం పది రోజుల్లో కమిషన్ను ప్రకటించనున్నారు. సచివాలయం (Secretariat)లో సీఎం బీసీ సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకతపైనా చర్చ జరిగింది. దీనిపై మరింత సమగ్ర సమాచారంతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరో ఎన్నికల హామీ అయిన బీసీల రక్షణ చట్టంపైనా చర్చ జరిగింది. దేశంలో మరో రాష్ట్రంలోనూ ఈ తరహా చట్టం అమలులో లేనందున ఈ ప్రతిపాదనను కేంద్రం దష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు నివేదించారు. తానే కేంద్రంతో మాట్లాడతానని, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని పక్కాగా బిల్లును రూపొందించాలని చంద్రబాబు నిర్దేశించారు. తుది రూపు తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ముందు కూడా దీన్ని పెట్టి చర్చించాలని సూచించారు. వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, వారికి ప్రయోజనం కలిగేలా పథకాలను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






