Chandrababu: రాజధానిపై వైసీపీ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టాలి : చంద్రబాబు
అమరావతి (Amaravati) రాజధానిగా కేంద్రం చట్టం చేస్తోందని, దీన్ని సగర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సూచించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, కార్యకర్తలతో సీఎం టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధానిపై వైసీపీ (YCP) చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టాలని ఆదేశించారు. రైతులు ఇచ్చిన భూములతోనే రాజధానిని నిర్మిస్తున్నాం. 2019లో మనం గెలిచి ఉంటే ఆదర్శ నగరంగా అమరావతి నిర్మాణమయ్యేది. గత పాలకులు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. దీంతో పెట్టుబడులు పెట్టేవారూ వెనుకంజ వేశారు. కానీ, ఇప్పుడు రాజధానికి చట్టం చేసి పారిశ్రామికవేత్తలతో పాటు అందరికీ మంచి అవకాశం కల్పించాం అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








