Chandrababu: 2028 నాటికి ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు : సీఎం చంద్రబాబు
హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సీఎం చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేస్తామని ఆయన వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ (Jal Jeevan Mission) 2.0 అమలు, నిర్వహణపై సీఎం చంద్రబాబు సమక్షంలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కార్యక్రమంలో చంద్రబాబు క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆపరేషన్, మెయింటెనెన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు వెల్లడించారు. దీనికి సంబంధించి 2025 సెప్టెంబర్ లోనే సమగ్ర విధానాన్ని ప్రకటించినట్టు గుర్తు చేశారు. తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించామని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జల్ జీవన్ మిషన్ అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. జల్ జీవన్ మిషన్ 2028 వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి కేంద్రం సహకరించాలని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం కోరారు.
ఇవి కూడా చదవండి








