RDT: కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వ్యాఖ్యానించారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్వచ్చంద సంస్థలకు విదేశాల నుంచి వస్తున్న నిధులను నిలిపివేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయంతో ఈ సంస్థ సేవలకు అంతరాయం కలిగిందని ప్రస్తావించారు. పేదల కోసం అద్భుతమైన సేవలు అందిస్తున్న ఆర్డీటీకి విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)కి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆర్డీటీ సంస్థ అందిస్తున్న సేవలను వివరించి, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేయగా, ఆయన చూపిన ప్రత్యేక చొరవతో నేడు అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిధుల సేకరణకు ఆర్డీటీని కేంద్రం అనుమతించడం ద్వారా నిధుల రాకకు మార్గం సుగమం అయ్యిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందుతున్న లక్షలాది మంది పేద ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








