VOntimitta: అంగరంగ వైభవంగా కోదండరాముని కల్యాణం
కడప జిల్లాలోని ఒంటిమిట్ట (VOntimitta) కోదండరాముడి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాత్రి 6.30 నుంచి 8.30 గంటల వరకు కల్యాణం వేడుక కనులపండువగా సాగింది. టీటీడీ ఆగమ పండితులు రాజేశ్ భట్టర్ (Rajesh Bhattar) మాంగల్యాధారణ చేశారు. ఆ సమయంలో కల్యాణ ప్రాంగణం సీతారామ నామస్మరణలతో మార్మోగింది. నింగి నుంచి పున్నమి చంద్రుడు చూస్తుండగా పండు వెన్నెల్లో, ఆహ్లాదకరమైన వాతావరణంలో లక్షలాది మంది భక్తుల సమక్షంలో కల్యాణ క్రతువును వేడుకగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు (Chandrababu) దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వీరివెంట మనుమడు దేవాంశ్ కూడా ఉన్నాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అంతకుముందు మంత్రులు, టీటీడీ, జిల్లా అధికారులతో కలిసి సీఎం దంపతులు కోదండ రామాలయానికి చేరుకున్నారు. సీతారామలక్ష్మణ మూలమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదిక వద్దకు చేరుకొని భక్తిశ్రద్ధలతో కల్యాణోత్సవాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (B.R. Naidu), తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి








