Christmas Celebrations: వారి భద్రత, గౌరవానికి భంగం కలగనివ్వం : చంద్రబాబు
క్రైస్తవుల భద్రత, గౌరవానికీ ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం కలగన్విబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. విజయవాడ (Vijayawada)లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో (Christmas celebrations) ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. క్యాండిల్ వెలిగించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి మతాన్నీ గౌరవిస్తామని, కూటమి ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందన్నారు. క్రైస్తవుల అభివృద్ధి (Christian development)కి కట్టుబడి ఉన్నామని వెల్లడిరచారు. పేదరికం లేని సమాజం చూడాలని నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అందరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు.






