NATA: న్యూజెర్సీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

NATA: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (NATA), యుఎస్ ఈవెంట్స్ (US Events) సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను న్యూజెర్సీలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 6, 2026 శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి ఎడిసన్‌లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి.
నిర్వాహక బృందం:
- ఉషారాణి చింత (Usharani Chinta)
- దేవి ప్రసాద్ (Devi Prasad)
- మంజు భార్గవ (Manju Bhargava)
- కల్పన రామ్ (Kalpana Ram)
- జ్యోతి వంగల (Jyothi Vangala)
- కృష్ణవేణి (Krishna Veni)
- అనురాధ భమిడి (Anuradha Bhamidi)
- రాశి శాంషాబాద్ (Rashi Shamshabad)
- శిరీష తిరుమల (Sirisha Tirumala)
- ప్రమీల గోపు (Prameela Gopu)
- బిందు మదిరాజు (Bindu Madiraju)
- రోహిత మంచిపట్ల (Rohitha Manchikatla)
- సుజాత వేంపరాల (Sujatha Vemparala)
- వసంత గడసమెట్టి (Vasantha Gadasmetty)
- పద్మ మోనా (Padma Mona)
- విజయ రమేష్ (Vijaya Ramesh)
కార్యక్రమ విశేషాలు:
- మహిళల కోసం ప్రత్యేకంగా ఫ్యాషన్ షో, డిజె మ్యూజిక్, డ్యాన్స్‌లు, గాన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
- ప్రముఖ మహిళలచే స్ఫూర్తిదాయక ప్రసంగాలు, విమెన్స్ షాపింగ్ మేళా, ఆటలు, సర్ప్రైజ్ గిఫ్ట్‌లు ఉంటాయి.
- సేవ్ ది వీవర్స్ సంస్థ ఈ కార్యక్రమం ద్వారా నేత కార్మికులకు తమ మద్దతును తెలుపుతోంది.
టికెట్ వివరాలు:
ఒక్కొక్కరికి ప్రవేశ రుసుము $40 కాగా, 10 మంది గ్రూపుగా వస్తే $350 కే అనుమతిస్తారు. ఇందులో భోజనం, పానీయాలు కూడా ఉంటాయి. ఫిబ్రవరి 10 లోపు టికెట్లు బుక్ చేసుకునే వారికి ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ వర్తిస్తుంది. మరిన్ని వివరాలకు (732) 692 0362, (571) 224 6523 లేదా (732) 874 3997 నంబర్లలో సంప్రదించవచ్చు.











































































