పెళ్లి సందడి2 సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీలీల తక్కువ టైమ్ లోనే ఎంత బిజీగా మారిందో తెలిసిందే.
అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ డాక్టర్ కావాలనే కోరికను మాత్రం శ్రీలీల వదులుకోలేదు.
ఓ వైపు నటిగా రాణిస్తూనే మరోవైపు చదువుపై దృష్టి పెట్టి రీసెంట్ గానే డాక్టర్ పట్టాను పొందింది.
తమ ఫ్యామిలీలో జరిగిన ఓ సంఘటన వల్లే శ్రీలీల డాక్టర్ చదవాలని డిసైడైందట.
అమ్మమ్మ హెల్త్ విషయంలో చేసిన వైద్య సహాయం శ్రీలీలను ప్రభావితం చేసిందని తెలిపింది.
శ్రీలీల తల్లి కూడా డాక్టర్ వృత్తిలోనే ఉండటం కూడా ఒక కారణం.
సినిమాల మధ్య కూడా చదువుకి, ఫిట్‌నెస్, వర్క్ బిలెన్స్‌కై సమయం కేటాయించింది.
డాక్టర్ అయ్యాక, సమాజానికి, ముఖ్యంగా మహిళలు, పిల్లల ఆరోగ్యానికి సేవ చేయాలని లక్ష్యం.