Abhishek Sharma: అభిషేక్ వీక్నెస్ పై పాక్ సెన్సేషనల్ కామెంట్స్..!

భారత జట్టుకు గత ఏడాది కాలంగా కీలక ఆటగాడిగా మారి.. టి20 జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న యువ ఆటగాడు అభిషేక్ శర్మ విషయంలో ఇప్పుడు ఆందోళన మొదలైంది. కీలక సందర్భాల్లో అతను ఫెయిల్ కావడంపై క్రికెట్ ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. టి వరల్డ్ కప్ లో (T20 World Cup)అతను వరుసగా మూడు మ్యాచ్ లలో ఫెయిల్ కావడం.. అది కూడా డకౌట్ లు కావడం పట్ల ఫ్యాన్స్ లో భయం మొదలైంది. ఈ తరుణంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ అమీర్(Mohmmadh Amir) కీలక వ్యాఖ్యలు చేసాడు. అతని వీక్నెస్ ను బయటపెట్టాడు.
అభిషేక్ ప్రతి డెలివరీ తన కంఫర్ట్ జోన్లో పిచ్ కావాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తుందని అమీర్ వ్యాఖ్యానించాడు. ప్రతి బంతిని షాట్ ఆడాలని ప్రయత్నం చేయవద్దన్నాడు. కొన్నేళ్ళ క్రితం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడటం మొదలుపెట్టిన.. పాక్ ఆటగాడు సైమ్ ఆయూబ్ కి కూడా ఇదే సమస్య ఉండేదని తెలిపాడు. నో లుక్ షాట్ లు ఆడేవాడు అని గుర్తు చేసుకున్నాడు. ఇక అభిషేక్ బలహీనతల గురించి అమీర్ కామెంట్ చేసాడు. అతని షాట్లు చాలా వరకు లెగ్ సైడ్లో ఉండటం వలన అతని బలహీనత ఎవరికీ తెలియదన్నాడు.
మూడు లేదా నాల్గవ స్టంప్ లైన్ లో బౌలింగ్ చేస్తే, అతను షాట్ సెలెక్షన్ లో ఫెయిల్ అవుతున్నాడని, ఇబ్బంది పడుతున్నాడన్నాడు. చివరి రెండు మ్యాచ్లలో కూడా, అతను ఆఫ్ సైడ్లో ఆడుతూ ఔటయ్యాడని గుర్తు చేసాడు. తన ఆఫ్-సైడ్ టెక్నిక్ ను మెరుగుపరుచుకోకపోతే, కెరీర్ లో ముందుకు వెళ్ళే అవకాశం ఉండదని హెచ్చరించాడు. బలమైన బౌలర్లు ఎల్లప్పుడూ బలహీనతను టార్గెట్ చేస్తారని, కంఫర్ట్ జోన్ లో ఉండకుండా చేస్తారన్నాడు. అభిషేక్ విషయంలో కూడా అంతే జరుగుతుందని, స్లాట్లోని ప్రతి బంతిని కొట్టాలని అతను కోరుకుంటాడన్నాడు.
కానీ అత్యున్నత స్థాయిలో, లేదా వన్డేల్లో, ప్రెజర్ క్రికెట్ లో ప్రతీ బంతిని ఆడలేరు అని అన్నాడు. సల్మాన్ ఆఘా, ఆర్యన్ దత్ కూడా అతన్ని ఇదే విధంగా అవుట్ చేశారని.. పేర్కొన్నాడు. 2026లో టీ20ల్లో ఐదుసార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ, ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఈ ఫార్మాట్ లో అత్యధిక డకౌట్లు అయిన ఓపెనర్లలో ఒకరిగా నిలిచాడు.











































































