ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యలు చాలా మందికి సాధారణంగా ఎదురవుతుంటాయి.
మార్కెట్లో వీటికోసం కెమికల్స్ తో నిండిన ఖరీదైన క్రీమ్స్ వాడిన పెద్దగా రిజల్ట్స్ కనిపించవు.
సెన్సిటివ్ గా ఉన్న స్కిన్ పై కెమికల్స్ ఉపయోగించకుండా ఇంట్లో లభ్యమయ్యే సహజ పదార్థాలతో సులభంగా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఇంటో తయారుచేసే ఫ్రూట్ ప్యాక్ తో ముఖం మీద వచ్చే ఎటువంటి మచ్చలనైనా సులభంగా తగ్గించవచ్చు. ఇది 100% నాచురల్ కాబట్టి స్కిన్ పై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
పండిన బొప్పాయి పేస్టులో కాస్త తేనె కలిపి ముఖంపై పాక్ వేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆరెంజ్ జ్యూస్ లో కాస్త షుగర్, కాఫీ పౌడర్ మిక్స్ చేసి ఫేస్ స్క్రబ్ చేస్తే డెడ్ సెల్స్ రిమూవ్ అవ్వడంతో పాటు మచ్చలు కూడా తగ్గుతాయి.
అరటిపండులు కాస్త ఓట్స్ కలిపి మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే స్కిన్ బాగా హైడ్రేట్ అయి కాంతివంతంగా మారుతుంది.
వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల మచ్చలు క్రమంగా తగ్గి చర్మం ఒకరెండు టోన్ ప్రకాశవంతం అవుతుంది. సహజ పదార్థాలు చర్మానికి హానికరం చేయవు.
అంతేకాకుండా, మంచి ఫలితాలకు సమయానికి తగినంత నీరు తాగడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం కూడా అవసరం. ఇది చర్మాన్ని లోపలి నుండి సురక్షితం చేస్తుంది.