T20 World Cup 2026: జింబాబ్వే మరో సంచలనం.. శ్రీలంకపై ఘన విజయం..!

టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2026) పసికూనలుగా భావించే జట్లు దిగ్గజ జట్లకు షాకిస్తూ టోర్నీని రసవత్తరంగా మారుస్తున్నాయి. తాజాగా జింబాబ్వే జట్టు మరో అద్భుత సంచలనాన్ని నమోదు చేసింది. గ్రూప్ స్టేజ్ పోరులో భాగంగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో జింబాబ్వే తన గ్రూప్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని అత్యంత ఆత్మవిశ్వాసంతో సూపర్-8 దశలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టును ఓడించి అందరి దృష్టిని ఆకర్షించిన జింబాబ్వే, ఇప్పుడు లంకను కూడా మట్టికరిపించి తన దూకుడును ప్రదర్శించింది.
నిశాంక మెరుపులు
ఈ మ్యాచులో (T20 World Cup 2026) టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ పాథున్ నిశాంక అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. నిశాంక 62 పరుగులతో రాణించగా, మిడిల్ ఆర్డర్లో పవన్ రత్నాయకే (44), కుశాల్ పెరీరా (22) వేగంగా ఆడారు. దీంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. అయితే కీలక ఆటగాళ్లు కుశాల్ మెండిస్ (14), కమిందు మెండిస్ (7), డాసున్ షనక (6) విఫలం కావడం లంక స్కోరుపై ప్రభావం చూపింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, గ్రీన్ క్రెమెర్, ఇవాన్స్ తలో రెండు వికెట్లు తీసి లంకను కట్టడి చేయడంలో (T20 World Cup 2026) సఫలమయ్యారు. ర్యాన్ బర్ల్‌కు ఒక వికెట్ దక్కింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బెనెట్, రజా జోడీ జోరు
అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన (T20 World Cup 2026) జింబాబ్వేకు ఆరంభంలోనే కొన్ని వికెట్లు పడినా బ్రియాన్ బెనెట్, కెప్టెన్ సికందర్ రజా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు కేవలం 40 బంతుల్లోనే 69 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయావకాశాలను మెరుగుపరిచారు. సికందర్ రజా 45 పరుగులతో మెరుపులు మెరిపించగా, బ్రియాన్ బెనెట్ (63 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. లంక బౌలర్ హేమంత రెండు వికెట్లు తీసి జింబాబ్వేను కాస్త ఒత్తిడిలోకి నెట్టినప్పటికీ, బెనెట్ అజేయంగా నిలిచి మున్యాంగా (8 నాటౌట్) సహకారంతో 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని (T20 World Cup 2026) పూర్తి చేశాడు. లంక బౌలర్లలో హేమంత రెండు, వెల్లలాగే, షనక చెరో వికెట్ పడగొట్టారు.











































































