INDvsNED: దుమ్మురేపిన దూబే.. అజేయంగా సూపర్-8కు భారత్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ (INDvsNED) 17 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. శివమ్ దూబే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లో 66 పరుగులు (4 ఫోర్లు, 6 సిక్సర్లు, స్ట్రైక్ రేట్ 212.90) చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇది అంతర్జాతీయ టీ20ల్లో దూబే టాప్ స్కోరు కూడా కావడం గమనార్హం.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. యువసంచలనం అభిషేక్ శర్మ మరోసారి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (34), హార్దిక్ పాండ్యా (30), తిలక్ వర్మ (31), ఇషాన్ కిషన్ (18) ఫర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ 3 వికెట్లు, ఆర్యన్ దత్ 2 వికెట్లు తీసుకున్నారు. కైల్ క్లీన్ ఒకటి.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
టార్గెట్ 194తో బరిలో దిగిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. నోవా క్రోస్ (25 నాటౌట్), జాక్ లయన్-కాషెట్ (26), బాస్ డి లీడే (33), కాలిన్ అకర్మన్ (23), మాక్స్ ఓ’డౌడ్ (20), మైఖేల్ లెవిట్ (24) కూడా రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించాడు. 3 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. శివమ్ దూబే 3 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఈ విజయంతో భారత్ టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా 12వ గెలుపు సాధించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచింది. స్లో పిచ్‌పై భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండూ అద్భుతంగా సాగాయి. కానీ ఫీల్డింగ్ మాత్రమే అత్యంత దారుణంగా చేసింది. పలు క్యాచులను భారత ఫీల్డర్లు నేలపాలు చేయడం గమనార్హం. నెదర్లాండ్స్ పోరాడినా చివరి ఓవర్లలో లక్ష్యం చేరలేకపోయింది. దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శన, వరుణ్ హ్యాట్రిక్ మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాయి.
ఇవి కూడా చదవండి













