TCA: కెనడాలో వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం..
TCA: కెనడాలోని తెలుగు భక్తుల కోసం తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ప్రతిష్టాత్మకంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించబోతోంది. ‘శ్రీశ్రీశ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం’ పేరుతో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిస్సిసాగాలోని కాళీబరి ఆలయం వేదిక కానుంది.
కార్యక్రమ వివరాలు:
- తేదీ: మార్చి 28, 2026 (శనివారం).
- సమయం: ఉదయం 9:00 గంటల నుండి ప్రారంభం.
- వేదిక: కాళీబరి టెంపుల్, 6815 ప్రొఫెషనల్ సీటీ, మిస్సిసాగా, ON L4V 1X6.
ప్రత్యేక ఆకర్షణ:
ఈ వేడుకకు వచ్చే భక్తుల కోసం భద్రాచలం నుండి నేరుగా తెప్పించిన ప్రసాదం లడ్డు అందజేయనున్నారు. అంతేకాకుండా, కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ప్రసాదం, మధ్యాహ్న భోజన సౌకర్యం కలదు. ఈ ఈవెంట్కు ప్రవేశం ఉచితం.

స్పాన్సర్షిప్ వివరాలు:
కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములు కావాలనుకునే వారి కోసం వివిధ స్పాన్సర్షిప్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
- కళ్యాణం (స్టేజ్) స్పాన్సర్షిప్: $516.00 (కేవలం 2 స్పాట్స్ మాత్రమే).
- కళ్యాణం స్పాన్సర్షిప్: $51.00.
- సంకల్పం స్పాన్సర్షిప్: $21.00.
వీటితో పాటు భోజనం, పూజా సాగ్రి కోసం విరాళాలు స్వీకరిస్తారు. చెల్లింపులను Interac Id: payments@telangana.ca ద్వారా చేయవచ్చు.
సంప్రదించాల్సిన వ్యక్తులు:
మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వారిని సంప్రదించవచ్చు.
- స్ఫూర్తి కొప్పు (Spoorthy Koppu) – కల్చరల్ సెక్రటరీ: (647) 469-3419.
- శంకర్ పోపూరి (Shankar Popuri) – జనరల్ సెక్రటరీ: (647) 888-4777.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రతినిధులు భక్తులందరినీ ఈ పవిత్ర కార్యంలో పాల్గొని తరించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి













