Buchibabu: పెద్ది డైరెక్టర్ కు కన్నడ స్టార్ గిఫ్ట్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా , బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది(peddi)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఎమోషన్స్, క్రీడా స్పూర్తి, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన కథతో ఈ సినిమా రూపొందుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్గా బుచ్చిబాబు సానా పుట్టినరోజు వేడుకలను చిత్ర యూనిట్ సెట్స్‌పైనే నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సందర్భంలో రామ్ చరణ్ ప్రత్యేక ఫోటోలు పోస్ట్ చేస్తూ డైరెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్(Siva rajkumar), బుచ్చిబాబు సానాకు స్పెషల్ గిఫ్ట్ అందజేసి సర్ప్రైజ్ చేశారు. డైరెక్టర్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం అభిమానుల మధ్య వైరల్ అవుతూ పెద్ది మూవీపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా ఒకే ఫ్రేమ్‌లో రెండు భిన్న భాషల సెలబ్రిటీలు కనిపించడం సినీ ప్రియులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్(Vriddhi cinemas) మరియు మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రిలీజ్ కు ముందు నుంచే ఏర్పడిన బజ్ చూస్తుంటే పెద్ది ఈ ఇయర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఒకటిగా నిలవడం ఖాయమనిపిస్తోంది.













