Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో ఆ రెండు స్థానాలకు
రాజ్యసభ (Rajya Sabha)ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో 10 రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తికాబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆయా స్థానాల్లో సభ్యులను ఎన్నుకోవడానికి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26 నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 5 నామినేషన్లకు, మార్చి 9 నామినేషన్ల ఉపసంహరణకు గడవు. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజున ఫలితాలు ప్రకటించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కేఆర్ సురేశ్ రెడ్డి (KR Suresh Reddy), కాంగ్రెస్ నుంచి అభిషేక్ సింఘ్వీల (Abhishek Singhvi) పదవీ కాలం ఏప్రిల్ 9తో పూర్తికానుంది. ఆ రెండు స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి.













