మార్కెట్‌లో పసిడి కాస్త చౌక… కొనడానికి ఇదే సరైన సమయమా?

18th February 2026

White Scribbled Underline

మహిళలకు శుభవార్త. బంగారం ధరలు ఇటీవలి రోజుల్లో తగ్గడంతో కొనుగోలుదారుల్లో మళ్లీ ఉత్సాహం కనిపిస్తోంది. 

పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇది మంచి అవకాశం అంటున్నారు మార్కెట్ నిపుణులు.

ఫిబ్రవరి 18 బుధవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,100గా ఉంది. 22 క్యారెట్లు రూ.1,39,425 కాగా, 18 క్యారెట్లు రూ.1,14,075 వద్ద కొనసాగుతోంది

గత వారం తో పోలిస్తే ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ నెల 11న 24 క్యారెట్లు రూ.1,58,890 వరకు వెళ్లగా, అక్కడి నుంచి దాదాపు రూ.6 వేల వరకు తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ పడిపోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. డాలర్ బలపడటంతో ఒక ఔన్స్ బంగారం ధర సుమారు 4,889 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశీయంగా ఇది ఆభరణాలు కొనేవారికి కొంత ఊరటనిచ్చింది. అయితే గత ఏడాది మొత్తం చూసుకుంటే బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం గుర్తుంచుకోవాలి.

భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయన్నది ప్రపంచ రాజకీయ పరిస్థితులు, డాలర్ విలువపై ఆధారపడి ఉంటుంది. 

అందుకే కొనుగోలు చేసే ముందు మార్కెట్ ధోరణిని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫాలో అవ్వండి.

తిరుపతి లడ్డూ రహస్యాలు

ఫిబ్రవరి 18 – ఈరోజు మీ లక్కీ కలర్ & లక్కీ నంబర్