Suhas: ఫలితం కోసం ఓపికగా ఎదురుచూస్తా
విభిన్న ప్రయోగాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుహాస్(suhas) ఇప్పుడు పూర్తి స్థాయి వినోదాత్మక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతను నటించిన తాజా చిత్రం హే బల్వంత్(Hey Balwanth) ఫిబ్రవరి 20న రిలీజ్ కాబోతుంది. మొదట హే భగవాన్ పేరుతో మొదలైన ఈ సినిమాకు సెన్సార్ సూచనల మేరకు టైటిల్ మార్చినట్లు సుహాస్ వెల్లడించాడు. కథా నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హే బల్వంత్ గా టైటిల్ ను ఫిక్స్ చేశామని చెప్పాడు. గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి(B Narendra reddy) నిర్మించగా, బన్నీ వాస్(Bunny Vasu), వంశీ నందిపాటి(Vamsi Nandipati) సమర్పిస్తున్నారు. శివానీ నగరం హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నరేష్(naresh), యాంకర్ స్రవంతి(Sravanthi) కీలక పాత్రలు పోషించారు. తన కెరీర్లోనే అత్యంత వేగంగా పూర్తైన సినిమా ఇదేనని సుహాస్ తెలిపాడు.
ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో కామెడీతో పాటూ ఎమోషన్స్ కు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందని సుహాస్ చెప్పాడు. కథ విన్న వెంటనే తనకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని, తాము ఊహించిన దానికంటే సినిమా వంద రెట్లు మెరుగ్గా వచ్చిందని సుహాస్ నమ్మకం వ్యక్తం చేస్తూ ఈ సినిమా తనకు మంచి సక్సెస్ను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
సినిమా రిజల్ట్ తాను ఆశించిన స్థాయిలో లేకపోయినా ప్రతి సినిమాకీ పూర్తి శ్రద్ధతో పనిచేస్తానని, ఫలితాల కోసం ఓపికగా ఎదురుచూస్తానని సుహాస్ చెప్పాడు. వరుస ఫెయిల్యూర్ల వల్ల కొంత గ్యాప్ తీసుకుని జాగ్రత్తగా కథలు ఎంపిక చేస్తున్నానని చెప్పిన సుహాస్, త్వరలో తమిళంలో మందాడి(mandadi) సినిమాలో మెయిన్ విలన్గా కనిపించనున్నట్లు, అలాగే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ బ్యానర్(Karthik subbaraj Banner)లో మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు.













