High Court: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక (Municipal election)కు అడ్డంకి తొలగింది. చైర్మన్ (Chairman) ఎన్నికపై తుది నిర్ణయం ఆర్వోదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 16వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన ఆకుల యాదగిరి (Akula Yadagiri)పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని జిల్లా కలెక్టర్, పోలీసులను ఆదేశించింది. యాదగిరి కనిపించడం లేదంటూ ఆయన కుమారుడు హరికాంత్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. యాదగిరి స్వచ్ఛందంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.













