Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫఆర్) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) విశాఖ ఈఎన్సీఆఫీసర్స్ మెస్‌లో విందు ( ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇచ్చారు. ఈ అంతర్జాతీయ ఉత్సవానికి హాజరవుతున్న వివిధ దేశాల నేవీ చీఫ్‌లకు దేశ రక్షణ దళాల సుప్రీం కమాండర్ వోదాలో రాష్ట్రపతి విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ విందుతో ఐఎఫఆర్ లాంఛనంగా ప్రారంభమైనట్లు భావిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir), ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి (Dola Sri Balaveeranjaneya Swamy), విశాఖ పోర్టు డిప్యూటీ చైర్మన్ రోషిణి అపరంజి, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చీఫ్ నేవల్ అధికారులు, ఫ్లీట్ కమాండర్లు, డీజీసీజీ, సీజీసీ( ఈఎస్), ఇతర కమాండర్లతో రాష్ట్రపతి గ్రూప్ ఫొటో దిగారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఐఎనఎస్ డేగాకు చేరుకున్న రాష్ట్రపతి గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు (Pawan Kalyan) స్వాగతం పలికారు.













