President: విశాఖలో ఐఎన్ఎస్ సుమేధ పై ప్రయాణించిన రాష్ట్రపతి
విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐ ఎఫ్ ఆర్) కొనసాగుతోంది. ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu), గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir), ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎనఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణించారు. రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ తదితర దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు 7 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి.













