Funky: ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్న ఫంకీ?
టాలీవుడ్ మాస్ కా దాస్ గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్(vishwak sen) హీరోగా, కాయదు లోహర్(kaayadhu lohar) హీరోయిన్గా నటించిన తాజా తెలుగు సినిమా ఫంకీ(Funky) రిలీజ్ కు ముందు ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ ను కలిగించినా, సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది. యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ ఫన్ ఎంటర్టైనర్కు మొదట్లో పెద్దగా బజ్ రాకపోవడం కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మాస్, కామెడీ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో నిలదొక్కుకోలేకపోవడంతో, ఇప్పుడు దాని ఓటీటీ రిలీజ్‌పై చర్చ మొదలైంది.
ఆల్రెడీ ఫంకీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మామూలుగా రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే సినిమాలు, ప్రస్తుత పరిస్థితుల్లో వేగంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు మళ్లుతున్నాయి. అదే దారిలో ఫంకీ కూడా థియేట్రికల్ రన్ ముగిసేలోపే ఓటీటీకి చేరే అవకాశాలున్నట్టు టాక్ వినిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా మూడు వారాల వ్యవధిలోనే స్ట్రీమింగ్కు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, మార్చి మొదటి వారంలోనే ఈ సినిమా ఓటీటీలో దర్శనమిచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాకు భీమ్స్(bheems) సంగీతం అందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments)తో పాటు ఫార్చూన్ ఫోర్ సినిమాస్(Frtune four cinemas) సంయుక్తంగా ఫంకీ మూవీని నిర్మించాయి. థియేటర్లలో ఆశించిన ఫలితం దక్కకపోయినా, ఓటీటీలో మాత్రం ఈ సినిమా కొత్త ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విశ్వక్ సేన్‌కు ఉన్న యూత్ ఫాలోయింగ్ దృష్ట్యా, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఫంకీకి మంచి రెస్పాన్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి అధికారిక ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పైనే ఉంది.













