Courts: తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు
తెలుగు రాష్ట్రాలోని పలు కోర్టు (Court)లకు బాంబు (Bomb) బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్, కరీంనగర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం (Rajahmundry) కోర్టులకు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు (Nampally Criminal Court)కు మరోసారి బాంబు బెదిరింపు రావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది కోర్టు నుంచి బయటకు పరుగులు తీశారు. బాంబ్ స్వ్కాడ్ చేరుకుని తనిఖీలు చేపట్టింది. బాంబులు అమర్చామని, 12 గంటల తర్వాత పేలుతాయని కరీంనగర్ జిల్లా కోర్టుకు బెదిరింపు మెయిల్ వచ్చింది.

ఇవి కూడా చదవండి













