AIADMK: అసెంబ్లీలో చెవులు కుట్టే ఫంక్షన్, అన్నాడిఎంకే సెన్సేషనల్ వీడియో..!
రాజకీయాల్లో కౌంటర్లు, విమర్శలు సహజమే.. కానీ ప్రజల్లోకి వెళ్ళే విధంగా కాకుండా రెగ్యులర్ గా విమర్శలు చేస్తే వాటికి పెద్దగా వెయిట్ ఉండదు. ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా విమర్శించాలి. ఈ విషయంలో ముందుండే తమిళనాడు అధికార అన్నాడిఎంకే తాజాగా రిలీజ్ చేసిన ఓ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఏంటి ఆ వీడియో అనేది ఈ స్టోరీలో ఓ లుక్ వేద్దాం.
ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపధ్యంలో, తమిళనాడు(Tamilnadu) సర్కార్ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తంగం తెన్నరసు మంగళవారం బడ్జెట్(Budget Session) ప్రవేశ పెట్టారు. ఈ నేపధ్యంలో సభలో అడుగుపెట్టిన అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు.. ఓ ఆహ్వాన పత్రికను తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ చిన్న పిల్లలకు చెవులు కుట్టించే కార్యక్రమంగా ఉందని, ఈ కార్యక్రమానికి అందరూ రావాలని ముహూర్తం ఫిక్స్ చేసింది. ‘బడ్జెట్ పేరుతో తమిళనాడు ప్రజలకు డీఎంకే(DMK) ప్రభుత్వం చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహిస్తోంది’ అని ఆహ్వాన పత్రికలో పేర్కొంది.
తేదీ: ఫిబ్రవరి 17, 2026, స్థలం : తమిళనాడు శాసనసభ, సమయం: ఉదయం 10 గంటల నుండి ‘ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, చెవులు కుట్టే కార్యక్రమానికి ఆర్థిక మంత్రి తంగం తమరసు నాయకత్వం వహిస్తారని అందులో ప్రస్తావించింది. ఇక వీడియోలో ఓ పెద్ద సూది పట్టుకుని, డిఎంకే నేతలు చెవులు కుట్టేందుకు ప్రయత్నం చేస్తుంటే, వారిని చూసి ప్రజలు పరుగులు పెడుతూ ఉంటారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్రాండ్ ఇయర్ పియర్సింగ్ ఫెస్టివల్ అంటూ.. గత నాలుగున్నరేళ్ళుగా, బడ్జెట్ పేరుతో తమిళనాడు ప్రజల కోసం నిర్వహిస్తున్న ఈ గొప్ప చెవులు కుట్టే ఉత్సవం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరగనుందని ఎద్దేవా చేసింది.













