Bhopal: ‘శుభలగ్నం’ సీన్ రిపీట్.. భర్తను అమ్మేసిన భార్య.. ఎంతకంటే?
Bhopal: సినిమాల్లో జరిగే వింత సంఘటనలు అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ ఎదురవుతుంటాయి. సరిగ్గా ‘శుభలగ్నం’ సినిమా తరహాలోనే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. తన భర్తను వదులుకోవడానికి ఒక భార్య ఏకంగా రూ. 1.5 కోట్లు డిమాండ్ చేయగా, అందుకు భర్త అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
భోపాల్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి, 52 ఏళ్ల మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టు నిబంధనల ప్రకారం ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ, సదరు భర్త మాత్రం తన భార్యతో కలిసి ఉండేందుకు ససేమిరా అన్నాడు. ప్రియురాలితోనే ఉంటానని ఖరాఖండిగా చెప్పేశాడు.
భారీ ఒప్పందం:
భర్త మొండితనాన్ని గమనించిన భార్య, ఒక భారీ డీల్‌ను ముందుకు తెచ్చింది. తన భర్తను పూర్తిగా వదిలేయాలంటే తనకు రూ. 1.5 కోట్లు, అదనంగా రూ. 27 లక్షలు, అలాగే ఒక ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తన ప్రియురాలితో కలిసి ఉండాలనే కోరికతో భర్త కూడా ఈ భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. వీరిద్దరి మధ్య కుదిరిన ఈ వింత ఒప్పందాన్ని కోర్టు కూడా అధికారికంగా గుర్తించి ధ్రువీకరించింది.
సినిమాలో ఆమని పాత్రను తలపించిన ఈ నిజజీవిత సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.













