India-France: క్షిపణీరంగంలో రారాజుగా భారత్.. !
భారత్ తన రక్షణ వ్యవస్థ బలోపేతంపై ఫోకస్ పెంచింది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో క్షిపణీ వ్యవస్థ ప్రాముఖ్యత బాగా అర్థం కావడంతో వాటిని సమీకరించుకోవడంపై దృష్టి సారించింది. మొన్నటివరకూ క్షిపణులు, వాటి ప్రయోగ వ్యవస్థలను కొనుగోలు చేస్తూ ముందుకెళ్లిన భారత్.. ఇప్పుడు మేకిన్ ఇండియాలో భాగంగా తయారీపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రష్యా సమన్వయంతో శత్రు భయంకరమైన బ్రహ్మోస్ క్షిపణులను ఇండియా తయారు చేస్తోంది.వాటిని కొన్ని మిత్రదేశాలకు విక్రయాలు చేస్తోంది కూడా.
ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫేల్ యుద్ధవిమానాలను భారత్ ప్రయోగించింది. వాటికి వాడే హ్యామర్ క్షిపణుల తయారీపై మోడీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇటీవలే 114 రఫేల్ యుద్ధవిమానాలకు సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తో కలిసి ఒప్పందాలపై సంతకాలుచేసిన ప్రధాని మోడీ.. లేటెస్టుగా హ్యామర్ క్షిపణుల తయారీకి పచ్చజెండా ఊపారు. దీంతో ఫ్రాన్స్ సహకారంతో భారత్ దేశీయంగా హ్యామర్ క్షిపణులను తయారు చేయనుంది

లేటెస్టు డీల్ లో భాగంగా 114 రఫేల్ యుద్ధవిమానాలకు అదనంగా హ్యామర్ క్షిపణులు తయారు చేయాల్సి ఉంది. దీంతో పాటు స్వదేశీ తేజస్ యుద్ధ విమానాలకు కూడా ఈ క్షిపణులను జోడించనున్నారు. ఈ క్షిపణులను ఇండియాలోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ సంయుక్తంగా తయారు చేయనున్నాయి.
మేకిన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా హెచ్125 హెలికాప్టర్లను కూడా స్వదేశీయంగా తయారు చేయనున్నారు. కర్నాటకలోని వేమగాల్లో అసెంబ్లింగ్ యూనిట్ ప్రారంభమైంది. వీటిని యూరోపియన్ సంస్థ ఎయిర్‌బస్, భారత్‌కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ఇది లైట్ మల్టీరోల్ హెలికాప్టర్. మంచు పర్వతాల్లోనూ సత్తా చాటుతుంది. హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు వరకు ఇది ఎగరగలదు.
ఇవి కూడా చదవండి













