Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు అభినందనలు
మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే కాకుండా కరీంనగర్ (Karimnagar) మేయర్ పీఠాన్ని బీజేపీ (BJP) కైవసం చేసుకోవడంపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం సంతోషం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీజేపీ తొలిసారి కార్పొరేషన్ మేయర్ పదవి దక్కించుకోవడం అభినందనీయం అని పేర్కొంది. హైదరాబాద్ శివారులో పండిట్ దీన్‌దయాళ్ మహా ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ సంస్థాగత వ్యవహారాల సంయుక్త ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, అగ్రనాయకులు తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, పార్టీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కు అభినందనలు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ మంచి ఫలితాలు సాధించిన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు నాయకులు అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













