Allen Hyderabad : JEE మెయిన్ 2026 ఫలితాల్లో అలెన్ హైదరాబాద్ ప్రభంజనం
JEE Main 2026 Results: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసిన జెఈఈ మెయిన్ 2026 (జనవరి సెషన్) ఫలితాల్లో అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఈ పరీక్షలో ఇన్స్టిట్యూట్కు చెందిన ఇద్దరు విద్యార్థులు 99.99 పర్సెంటైల్ కంటే ఎక్కువ స్కోరు సాధించి సంచలనం సృష్టించారు.
హైదరాబాద్ విజేతలు:
అలెన్ సౌత్ జోన్ హెడ్ మహేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, అలెన్ హైదరాబాద్కు చెందిన సామవేదం రఘు కపీష్ అక్షిత్ (99.9976982 పర్సెంటైల్), నియువ్ కొచెటా (99.9962271 పర్సెంటైల్) అత్యుత్తమ స్కోర్లు సాధించారు. హైదరాబాద్ సెంటర్ నుండి మొత్తం 7గురు విద్యార్థులు 99.9 పర్సెంటైల్ కంటే ఎక్కువ, 51 మంది విద్యార్థులు 99 పర్సెంటైల్ పైగా స్కోర్ సాధించారని సెంటర్ హెడ్ సౌరభ్ తివారీ వెల్లడించారు. అలెన్ క్రమశిక్షణతో కూడిన శిక్షణే ఈ విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
జాతీయ స్థాయిలో అలెన్ జోరు:
జాతీయ స్థాయిలో కూడా అలెన్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 12 మంది విద్యార్థులు 100 పర్సెంటైల్ సాధించగా, అందులో ఏడుగురు అలెన్ క్లాస్రూమ్ విద్యార్థులే కావడం విశేషం. ముఖ్యంగా అలెన్ కోటా విద్యార్థి కబీర్ చిల్లార్ 300కి 300 పూర్తి మార్కులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. అర్నవ్ గౌతమ్, శుభం కుమార్, భవేష్ పాత్ర, అనయ్ జైన్, నిమీ పురోహిత్, చిరంజీబ్ కర్ కూడా 100 పర్సెంటైల్ క్లబ్లో చేరారు.
టాపర్ మాటల్లో..
తన విజయంపై టాపర్ ఎస్ఆర్కే అక్షిత్ స్పందిస్తూ.. “అలెన్ హైదరాబాద్లో ఉన్న విద్యా వాతావరణం, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసే అధ్యాపకుల సహకారం వల్లే ఈ ఘనత సాధించగలిగాను” అని సంతోషం వ్యక్తం చేశాడు. అలెన్ సంస్థ తన ఫలితాల పారదర్శకతను నిరూపించుకోవడానికి ప్రముఖ ఆడిట్ సంస్థ ‘ఈవై ఇండియా’ (EY India) చేత ఈ ఫలితాలను ధృవీకరించినట్లు సంస్థ సీఈఓ నితిన్ కుక్రేజా తెలిపారు.
ఇవి కూడా చదవండి













