Sree Leela: పాన్ ఇండియాపై స్టార్ హీరోయిన్ ఫోకస్
తక్కువ కాలంలోనే భారీ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీలీల(Sree Leela) టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్గా నిలిచింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్‌లు దక్కించుకుని ఇండస్ట్రీలో వేగంగా ఎదిగింది. అయితే వరుసగా సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ రేట్ మాత్రం ఆశించినంతగా లేదు. కొన్ని ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా, ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా మెడిసన్ పూర్తి చేసి డాక్టర్ డిగ్రీని అందుకున్న శ్రీలీల సినిమాలతో పాటు విద్యకు ప్రాధాన్యం ఇచ్చిన తీరు ఆమెపై మరింత గౌరవాన్ని పెంచింది.
ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagath singh) మాత్రమే ఆమె చేతిలో ఉంది. అయితే శ్రీలీల ఇప్పుడు వేరే భాషలపై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పరాశక్తి(Parashakthi) సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా శ్రీలీలకు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ తమిళంలో అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం స్టార్ హీరో ధనుష్(Dhanush) తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న లీల, ధృవ్ విక్రమ్(Dhruv Vikram) తో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
మరోవైపు ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. హిందీలో కూడా పలు ప్రాజెక్టులపై చర్చలు జరుపుతూ అవకాశాలను విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. టాలీవుడ్లో వచ్చిన బ్రేక్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీలీల, ఇప్పుడు ఇతర భాషల్లోనూ తన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తోంది. చూస్తుంటే ఆమె ఫోకస్ మెల్లగా పాన్ ఇండియా స్థాయికి మారుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా భిన్న భాషల్లో సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను విస్తరించాలనే వ్యూహంతో శ్రీలీల ముందుకు సాగుతోంది. రాబోయే ప్రాజెక్టులు ఆమె కెరీర్‌ను ఏ స్థాయికి చూడాలి.













