The Kerala Story2: అంచనాలు పెంచుతున్న ది కేరళ స్టోరీ2 ట్రైలర్
2023లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ది కేరళ స్టోరీ సక్సెస్ అవడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ది కేరళ స్టోరీ2 వస్తోంది. తాజాగా విడుదలై ఈ సినిమా ట్రైలర్ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. రానున్న 25 ఏళ్లలో భారత్ సరియా చట్టాల ఆధారంగా నడిచే ఇస్లామిక్ దేశంగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికతో ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత కథ రాజస్థాన్‌కు మారుతూ, 16 ఏళ్ల బాలికను మతమార్పిడికి బలవంతం చేశారనే ఆరోపణలతో ఆమె కుటుంబం పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేయడానికి వచ్చే సన్నివేశాలను చూపించారు.
ఇక కథ మధ్యప్రదేశ్‌లో మరో కథ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రేమ పేరుతో ఓ హిందూ యువతిని మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత మత మార్పిడికి ఒత్తిడి తెచ్చే ఘటనను చూపిస్తూ ఎమోషన్ ను పెంచారు. మూడో కథ కేరళలో నడుస్తూ, లివ్ ఇన్ రిలేషన్షిప్ పేరుతో ఒక యువతిని మతం మార్చుకునేలా ఒత్తిడి చేయడం, ఆమె నిరాకరించడంతో బలవంతంగా నిర్బంధించడం వంటి సీన్స్ ను చూపించారు. ప్రతిబింబిస్తుంది. మతమార్పిడి అనంతరం ఈ ముగ్గురు యువతులు ఎదుర్కొనే హింస, వారి కుటుంబాలు పడే వేదనను ట్రైలర్ లో చాలా క్లియర్ గా చూపించారు.
ఈ సినిమాకు కామాఖ్య నారాయణ సింగ్ దర్శకత్వం వహించగా, ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్యా ఓజాప్రధాన పాత్రల్లో నటించారు. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మేకర్స్ ఈసారి మౌనం కాదు, పోరాటం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేయడంతో సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది.













