Prakash Raj: వారణాసిలో పాత్రపై ప్రకాష్ రాజ్ క్లారిటీ
దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) తెరకెక్కిస్తున్న భారీ సినిమా వారణాసి(varanasi)పై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్(prakash raj) కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదట ఈ క్యారెక్టర్ కు బాలీవుడ్ నటుడు రజత్ కపూర్(rajat kapoor) ను తీసుకున్నప్పటికీ, తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆ పాత్రకు ప్రకాశ్ రాజ్‌ను ఎంపిక చేయగా, ఇప్పటికే ఆయనకు సంబంధించిన పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.
రీసెంట్ గా ఓ ఈవెంట్ లో మాట్లాడిన ప్రకాశ్ రాజ్, వారణాసిలో తాను మహా శివభక్తుడిగా కనిపిస్తానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన పాత్ర కథలో కీలక మలుపుకు కారణమవుతుందని తెలుస్తోంది. కొందరు మాత్రం మహేష్ బాబు తండ్రి పాత్రలో కనిపించే అవకాశముందని అంటున్నప్పటికీ, దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. రాజమౌళి చిత్రాల్లో పాత్రల భావోద్వేగ బలం ఎంత ముఖ్యమో తెలిసిందే కాబట్టి, ఈ పాత్ర కూడా హీరో ప్రయాణంలో ఆధ్యాత్మిక, భావోద్వేగ ప్రభావం చూపుతుందనే అంచనాలున్నాయి.
ఇప్పటికే సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైనట్లు దర్శకుడు వెల్లడించారు. ఆగస్టు నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా(priyanka chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(prithvi raj sukumaran) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం స్పిరిట్(spirit), దృశ్యం3(Drishyam3) వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చూస్తుంటే వారణాసిలో తర్వాత ఆయనకు పాత్ర పాన్ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయమనిపిస్తుంది.
https://x.com/SSMBTrendsTeam/status/2023404460106772608?s=20













