US Visa: వీసా అనుమతి మాత్రమే .. హక్కు కాదన్న అమెరికా విదేశాంగశాఖ..!
వీసా నిబంధనల విషయంలో అమెరికా మరోసారి తన వైఖరిని విస్పష్టంగా తెలియజేసింది. వీసా అనేది కేవలం అనుమతి మాత్రమే అని ఈ సందర్భంగా వెల్లడించింది. ఎవరైనా వీసాను తన హక్కుగా భావిస్తే అది వారి మూర్ఖత్వమే అవుతుందని అమెరికా విదేశాంగ స్పష్టం చేసింది. విదేశీ పర్యాటకులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది. విద్యార్థులు, టూరిస్టులు, జర్నలిస్టులు సహా అన్ని వర్గాల వారికి ఈ విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది. గడిచిన ఏడాదిలో అనేక వీసాలను రద్దు చేసినట్లు తెలిపింది..
‘‘వీసా అనేది హక్కు కాదు. దీనికి రాజ్యాంగబద్ధమైన హక్కు లేదు. టూరిస్టులకు మా దేశంలోకి ప్రవేశించేందుకు ఇచ్చే ఓ అనుమతి మాత్రమే. ఈ విషయాన్ని పదే పదే చేప్తున్నప్పటికీ కొంతమంది దీన్ని అర్థం చేసుకోలేక పోతున్నారు. టూరిస్టుల ముసుగులో మా దేశంలోనికి ప్రవేశించి, మా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేక చర్యలకు పాల్పడితే, వారి వీసాను రద్దు చేస్తాం’’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. హంగేరియన్ ప్రధానితో భేటీ సందర్భంగా ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి
వీసాల జారీ విధానాన్ని ఇటీవల మరింత కఠినతరం చేసిన అమెరికా.. గత నెల అనేక దేశాలకు వీసా జారీ నిలిపివేసింది. దీంతో ఈ జాబితాలో ఉన్న దేశాల సంఖ్య 75కు చేరుకుంది. ఆయా దేశాల నుంచి వచ్చే వలసదారులు అమెరికన్ల ఉపాధి అవకాశాలను ఆమోదయోగ్యం కాని స్థాయిలో ప్రభావితం చేస్తున్నారని వైట్‌హౌస్ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి













