Bandi Sanjay: ధనవంతులు, గుణవంతులకు మధ్య పోటీ : బండి సంజయ్
ఇచ్చిన హామీలు, గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ (Congress Party) అమలు చేయడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో బీజేపీ (BJP) నేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరీంనగర్లో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ధనవంతులు, గుణవంతులకు మధ్య పోటీ జరుగుతోందని చెప్పారు. కరీంనగర్ (Karimnagar) అభివృద్ధికి స్థానికులు సహకరించి కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పన్నులు పెంచుతారన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













