Ambati Rambabu: జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల
ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైలులో ఉంచినా వెనకడుగు వేయను అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) పేర్కొన్నారు. రాజమహేంద్రవరం (Rajahmundry) కేంద్రం కారాగారం నుంచి విడుదలైన ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ (Jagan) నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేవరకూ నా పోరాటం ఆగదు అని అన్నారు. తనను అన్యాయంగా జైలులో పెట్టారని ఆరోపించారు. ఈ 18 రోజుల జైలుజీవితం ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశానన్నారు.. జైలు వద్ద మాజీ మంత్రులు వేణు, తానేటి వనిత, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, మాజీ ఎంపీ వంగా గీత తదితరులు రాంబాబును కలిశారు.

కారాగారం నుంచి అంబటి విడుదల సందర్భంగా వైసీపీ శ్రేణులు రచ్చరచ్చ చేశారు. ఆయన బయటికొస్తుండగా బారికేడ్లను తోసుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అతికష్టం మీద నిలువరించగలిగారు. కారులో రాజమహేంద్రవరంలో ప్రకాష్నగర్లోని మాజీ ఎమ్మెల్య జక్కంపూడి రాజా (Jakkampudi Raja) ఇంటికి అంబటి బయలుదేరగా, జై జగన్ అని నినాదాలు చేస్తూ పార్టీ జెండాలు, డప్పు వాయిద్యాలతో రావడంతో ట్రాఫిక్ స్తంభించి జనం నరకం చూశారు. జక్కంపూడి నివాసం ఎదుగ రోడ్డు వద్ద వైసీపీ శ్రేణుల తాకిడితోరాకపోకలు నిలిచిపోయాయి. రాంబాబు జక్కంపూడి నివాసంలోనే బస చేశారు.
ఇవి కూడా చదవండి













