Raghurama: సాక్షి మీడియాకు డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు
సాక్షి మీడియాకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghuramakrishna Raju) లీగల్ నోటీసులు జారీ చేశారు. తనకు వ్యతిరేకంగా కథనాలు రాయడంతోపాటు తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కథనాలు ఉంటున్నాయంటూ నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి రెడ్డి (YS Bharathi Reddy), ఎడిటర్, బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లతో సహా సాక్షి మీడియా ప్రతినిధులకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులను న్యాయవాది ఉమేశ్ చంద్ర (Umesh Chandra) జారీ చేశారు. తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో రఘు రామ డిమాండ్ చేశారు. లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా పరిహారంగా రూ.కోటి చెల్లించాలని, ఆ మొత్తాన్ని అమరావతి రైతుల (Amaravati farmers)కు ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













