Budget: ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ (Budget) సమావేశాల తేదీ ఖరారైంది. ఈనెల 26 నుంచి శాసననసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma) ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఫిబ్రవరి 28న అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ రూపకల్పనపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నేతృత్వంలో శాఖలవారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు.

ఈసారి బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma’s house), గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి













