Chiranjeevi: నా సక్సెస్‌కు నా టాలెంట్, కృషి కారణ కాదు
మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో అందరినీ ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 20న తమ వివాహ వార్షికోత్సవం కూడా వస్తుండటంతో, ఈ రెండు ప్రత్యేక సందర్భాలను గుర్తుచేసుకుంటూ మెగాస్టార్ తన లైఫ్ సక్సెస్ వెనుక ఉన్న అసలైన బలం ఎవరో స్పష్టంగా వెల్లడించారు. తన సక్సెస్ సీక్రెట్ తన టాలెంట్ కాదు, తన కష్టపడే స్వభావం కాదని, సురేఖనే అంటూ మెగాస్టార్ ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో అపార విజయాలు, అభిమానుల ఆదరణ, స్టార్డమ్ అన్నీ ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితం స్థిరంగా నిలవడానికి కారణం భార్యే అని చిరూ స్పష్టం చేశారు. కుటుంబ బాధ్యతలన్నింటినీ సురేఖ తన భుజాలపై వేసుకోవడం వల్లే తాను పూర్తిగా సినిమాలపై దృష్టి సారించగలిగానని చిరంజీవి వెల్లడించారు. తన తల్లిదండ్రులకు నిజమైన కూతురిలా మారి వారి ప్రేమను సంపాదించుకోవడం నుంచి, కుటుంబ సభ్యులందరినీ ఒకటిగా ఉంచే శక్తిగా నిలవడం వరకు.. ప్రతి దశలోనూ ఆమె పాత్ర కీలకమని చిరూ కొనియాడారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కష్టాలొచ్చినప్పుడు ధైర్యంగా నిలబెడుతూ ధైర్యాన్ని ఇవ్వడం, సెలబ్రేషన్స్ టైమ్ లో ఆనందాన్ని రెట్టింపు చేసే ఆత్మీయత.. ఈ రెండింటికీ సురేఖనే ఆధారమని, తన జీవితంలో మనశ్శాంతి, స్థిరత్వం, సమతౌల్యం ఇవన్నీ ఆమె వల్లే సాధ్యమయ్యాయని ఆయన ఎమోషనల్ అయ్యారు. సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న ఓ స్టార్ తన విజయాలన్నింటికీ భార్యకు క్రెడిట్ ఇవ్వడమనేది అరుదైన విషయం.













