DSC: త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి లోకేశ్
జాబ్ క్యాలెండర్ లో భాగంగా త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో లోకేశ్ మాట్లాడారు.సమగ్ర శిక్షా అభియాన్లో ఒప్పంద ఉద్యోగుల వేతనాల పెంపు అంశంపై ప్రశ్నకు లోకేశ్ సమాధానం ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలతో సర్వశిక్ష అభియాన్లో ఆంధ్రప్రదేశ్లోనే (Andhra Pradesh) ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టి కి తీసుకెళ్తామన్నారు. ఈసారి డీఎస్సీలో కర్నూలు (Kurnool)కు ఎక్కువ టీచర్ పోస్టులను మంజూరు చేస్తామన్నారు.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});













