DSC: ఈసారి జాబితాలో పేరు లేని వారు నిరుత్సాహపడొద్దు : లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ (DSC)లో అర్హత పొందిన అభ్యర్థులందరికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అభినందనలు తెలిపారు. మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా (List) విడుదల అనంతరం లోకేశ్ మాట్లాడారు. మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరింది. ఈ మైలురాయి నా బాధ్యతను మరింత పెంచింది. ఈసారి జాబితాలో పేరు లేని వారు నిరుత్సాహపడొద్దు. హామీ ఇచ్చినట్లు ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. సీఎంగా చంద్రబాబు (Chandrababu) బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ (DSC file) పైనే చేశారు అని లోకేశ్ పేర్కొన్నారు.