Telangana: తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ లోగో ఆవిష్కరణ
తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ అధికారిక లోగోను మంగళవారం నాడు ఆవిష్కరించారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ లోగోను ఆవిష్కరించారు. కార్పొరేషన్ ఛైర్పర్సన్ కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, బెల్దే శ్రీధర్, ఆకుల రమాకాంత్, సరాపు సంతోష్, బచ్చు చైతన్య, పార్సి ప్రకాష్, దారం సతీష్, నల్మాస్ దేవేందర్, రావికంటి శ్రీనివాస్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా మార్చి నెలలో ఎల్బీ స్టేడియంలో జరగనున్న ‘శ్రీ వాసవీ మహా శక్తి మహోత్సవం’ గురించి కూడా చర్చించారు. ఆ సమయంలో జరిగే సామూహిక పారాయణ కార్యక్రమంలో సుమారు 45 వేల మంది భక్తులు పాల్గొంటారని, ఈ ఉత్సవం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తెలంగాణ (Telangana) ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా ఆహ్వానించారు.













