Babar Azam: బాబర్ ఓ చెత్త ప్లేయర్, పాక్ మాజీ క్రికెటర్..!

క్రికెట్ లో ఫార్మాట్ కు తగినట్లు రాణించాల్సి ఉంటుంది. స్వదేశంలో మనం ఎంత స్టార్ అయినా.. అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శన అనేది అంచనాలకు తగ్గట్టు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజం ఫెయిల్ అవుతున్నాడు. అతని స్థాయికి తగ్గ ఆట తీరు కనపడటం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై పాక్(Pakistan) మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. బాబర్ ఆజంకు పొట్టి ఫార్మాట్లో రాణించడానికి కావాల్సిన టాలెంట్ లేదన్నాడు.
బాబర్ టి20 వరల్డ్ కప్(T20 World Cup) లో మూడు మ్యాచ్ లలో కేవలం 66 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీనితో తుది జట్టు నుంచి అతనిని పక్కన పెట్టాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి. బాబర్‌ను జట్టు నుండి తొలగించాలని తాను ప్రతిపాదించినందున తాను సెలెక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని యూసఫ్ గుర్తు చేసుకున్నాడు. అయితే జట్టు యాజమాన్యం మొత్తం ఈ విషయంలో అతని విషయంలో సీరియస్ గా ఉండటంతో తన రాజీనామా ఆమోదించలేదు అని తెలిపాడు.
బాబర్ టెక్నిక్ పూర్తిగా తగ్గిపోయిందని నేను 2-3 సంవత్సరాలుగా చెబుతున్నాను అంటూ గుర్తు చేసుకున్నాడు. అతను ఫామ్‌లో లేడని తాను పదే పదే వింటున్నానని.. నిజంగానే అతను ఫాంలో లేడన్నాడు. ఒక ఆటగాడు రెండు మూడు సిరీస్‌లకు మాత్రమే ఫామ్‌లో ఉండగలడు. అతను గత రెండు-మూడు సంవత్సరాలుగా పరుగులు సాధించలేదు. నేను బాబర్‌కు విశ్రాంతి ఇవ్వమని సూచించిన క్షణంలో.. అందరూ తనపై అకస్మాత్తుగా విరుచుకుపడ్డారని మండిపడ్డాడు. దీని కారణంగా తాను రాజీనామా చేయాల్సి వచ్చిందన్నాడు.
చివరికి అతను రెండు సిరీస్‌ల తర్వాత జట్టులో చోటు కోల్పోయాడన్నాడు. అవసరమైన నైపుణ్యాలు లేకుండా మానసికంగా ఎంత బలంగా ఉన్నా సరే విలువ ఉండదు అన్నాడు. మనస్తత్వాన్ని మాత్రమే సమస్యగా పరిగణించలేమని పేర్కొన్నాడు. మీకు నైపుణ్యం లేకపోతే, మెదడు ఏం చేస్తుందని ప్రశ్నించాడు. బాబర్ ను యూసఫ్ కాలం నాటి ఆటగాళ్లతో పోల్చమని అడగగా.. అసలు ఏ ఆటగాడితో కూడా పోల్చే సత్తా బాబర్ కు లేదన్నాడు. వాళ్ళు చాలా పెద్ద ఆటగాళ్ళు అని గుర్తు చేసుకున్నాడు.











































































