Babar Azam: విరాట్ కోహ్లీతో పోలిక నుంచి జట్టుకు భారంగా.. బాబర్ అజామ్ పతనం!

“మీకు విరాట్ కోహ్లీ ఉంటే, మాకు బాబర్ అజామ్ (Babar Azam) ఉన్నాడు”.. ఒకప్పుడు పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఎంతో గర్వంగా చెప్పుకున్న మాట ఇది. కానీ కాలం మారింది, పరిస్థితులు తారుమారయ్యాయి. అప్పట్లో ప్రపంచ మేటి బ్యాటర్లతో సరిసమానంగా కీర్తి అందుకున్న బాబర్ అజామ్ (Babar Azam).. ఇప్పుడు సాధారణ బ్యాటర్‌గా మిగిలిపోయాడు. తన ఫామ్ లేమితో తీవ్రంగా సతమతమవుతున్నాడు. ఒకప్పుడు పాకిస్థాన్ జట్టుకు వెన్నెముకగా నిలిచిన ఈ స్టార్ ఆటగాడు, ఇప్పుడు అదే జట్టుకు మోయలేని భారంగా మారిపోయాడు. కొన్నాళ్లు జట్టుకు దూరమై తిరిగి వచ్చినా అతని ఆటలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత అతన్ని జట్టు నుంచి సెలక్టర్లు సాగనంపడం దాదాపు లాంఛనంగానే కనిపిస్తోంది.
నమీబియా మ్యాచ్‌లో ఘోర అవమానం:
టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశలో భాగంగా నమీబియాతో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుత విజయం సాధించి సూపర్-8కి అర్హత సాధించింది. అంతకు ముందు భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో పాక్ 199 పరుగుల భారీ స్కోరు చేసి 102 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఈ మ్యాచ్ బాబర్ అజామ్‌కు (Babar Azam) తీరని అవమానాన్ని మిగిల్చింది. సాధారణంగా జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే బాబర్‌ను కాదని.. ఖవాజా నఫే, షాదాబ్ ఖాన్‌లను అతనికంటే ముందు బ్యాటింగ్‌కు పంపింది పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా, టీమ్ యాజమాన్యం. కీలకమైన ఆటగాడిని ఇలా పక్కనపెట్టి ప్రయోగాలు చేయడం బాబర్‌ను తీవ్రంగా అవమానించడమే అని అతని అభిమానులు యాజమాన్యంపై మండిపడుతున్నారు.

చేజేతులా చేసుకున్నదే:
ఒక గొప్ప ఆటగాడికి ఇలాంటి దుస్థితి రావడం నిజంగా అనూహ్యం. కానీ దీనికి బాబర్ (Babar Azam) పేలవమైన ఫామ్ దీనికి ప్రధాన కారణం. ఇది అతను చేజేతులా తెచ్చుకున్నదే. ఈ టోర్నీలో అమెరికా లాంటి పసికూనపై చేసిన 46 పరుగులు మినహాయిస్తే, మిగిలిన మ్యాచ్‌లలో అతని ఆటతీరు అత్యంత దారుణంగా ఉంది. నెదర్లాండ్స్‌పై కేవలం 15 పరుగులకే అవుటై జట్టును ఓటమి ముప్పులోకి నెట్టాడు. ఇక భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 7 బంతులు ఆడి కేవలం 5 పరుగులే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఘోర ఓటమి తర్వాత పాక్ అభిమానులు తమ జట్టుపై, ముఖ్యంగా బాబర్‌పై (Babar Azam) తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ అతన్ని జట్టు నుంచి వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. గత పది టీ20 ఇన్నింగ్స్‌లలో అతను కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించడం అతని వైఫల్యానికి అద్దం పడుతోంది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
‘జింబాబర్’ విమర్శలు:
బాబర్ అజామ్ (Babar Azam) కేవలం ఒక ‘ఓవర్ రేటెడ్‘ బ్యాటర్ అని విశ్లేషకులు ఎప్పటినుంచో విమర్శిస్తున్నారు. వన్డేల్లో 53.72 సగటుతో 20 సెంచరీలు, టెస్టుల్లో 42.38 సగటుతో 9 సెంచరీలు సాధించిన అతన్ని అభిమానులు కోహ్లీతో పోల్చారు. కానీ ఇదంతా స్వదేశంలో, ఫ్లాట్ వికెట్ల మీద, బలహీనమైన జట్లపై సెంచరీల మీద సెంచరీలు చేసి సాధించిన రికార్డులే అన్నది అతనిపై ఉన్న ప్రధాన విమర్శ. కఠినమైన ప్రత్యర్థులు, ప్రతికూల పరిస్థితులు ఎదురైతే బాబర్ (Babar Azam)ఎప్పుడూ విఫలమవుతుంటాడు. ఆస్ట్రేలియాలో అతని టెస్టు సగటు 25.25, వెస్టిండీస్‌లో 36.55, దక్షిణాఫ్రికాలో 41.40 మాత్రమే. వన్డేల్లో న్యూజిలాండ్ గడ్డపై (30.5) కూడా దారుణంగా విఫలమయ్యాడు. అయితే జింబాబ్వేపై మాత్రం 9 వన్డేల్లో 114.75 సగటుతో (2 సెంచరీలు, 2 అర్ధశతకాలు) చెలరేగాడు. అందుకే అతన్ని సోషల్ మీడియాలో అతన్ని ‘జింబాబర్’ అని ఎద్దేవా చేస్తుంటారు.
ఇవి కూడా చదవండి










































































