TLCA: టీఎల్సీఏ 2026 నూతన కార్యవర్గ ప్రకటన.. అధ్యక్షుడిగా సుమంత్ రామ్ సెట్టి

ఉత్తర అమెరికాలోని పురాతన తెలుగు సంఘాలలో ఒకటైన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association – TLCA) తమ 2026 ఎగ్జిక్యూటివ్ కమిటీని అధికారికంగా ప్రకటించింది. 1971లో స్థాపించిన ఈ సంస్థ, ప్రస్తుతం 55వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది.
ఈ నూతన కమిటీకి అధ్యక్షుడిగా సుమంత్ రాంశెట్టి (2025-2026) వ్యవహరించనున్నారు. కమిటీలోని ఇతర ముఖ్య బాధ్యులు వీరే:
వైస్ ప్రెసిడెంట్: శ్రీనివాస్ సాగిపల్లి
సెక్రటరీ: లావణ్య అట్లూరి
ట్రెజరర్: సునీల్ చల్లాగుళ్ల
ఎగ్స్-అఫీషియో పాస్ట్ ప్రెసిడెంట్: కిరణ్ రెడ్డి పర్వతాల
జాయింట్ సెక్రటరీ: దివ్య దొమ్మరాజు
జాయింట్ ట్రెజరర్: సుధా మన్నవ
వీరితో పాటు కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్ కారణం, సునీత పోలేపల్లి, శిరీష తునుగుంట్ల, రజిత కల్లూరి, రాంబాబు జల్లెపల్లి, సాయి దేవినేనిలు నియమితులయ్యారు.
55 ఏళ్ల ఘన చరిత్ర
న్యూయార్క్, న్యూజెర్సీ మరియు కనెక్టికట్ (Tri-state area) ప్రాంతాల్లోని తెలుగు ప్రజలను ఏకం చేస్తూ, తెలుగు భాష, సాహిత్యం మరియు సంస్కృతిని భావి తరాలకు అందించడంలో టీఎల్సీఏ (TLCA) కీలక పాత్ర పోషిస్తోంది. 55 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ సంస్థ అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. నూతన కార్యవర్గం నేతృత్వంలో రాబోయే కాలంలో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది.











































































