Delhi: హామీల అమలుపై రాహుల్, ఖర్గే ఆరా.. ఢిల్లీలో తెలంగాణ నేతలతో హైకమాండ్ భేటీ!

Delhi: తెలంగాణలో ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర ముఖ్యనేతలతో వారు కీలక సమావేశం నిర్వహించారు.
కీలక అంశాలపై చర్చ:
పెన్షన్లు, ఆర్థిక సాయం: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వృద్ధాప్య పెన్షన్ రూ. 4,000కు పెంపు, అలాగే మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం (మహాలక్ష్మి పథకం) అమలుపై ఏఐసీసీ నేతలు ఆరా తీశారు. ఈ పథకాలు ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.
ఆర్థిక సవాళ్లపై సీఎం వివరణ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ భారీ పథకాల అమలులో ఎదురవుతున్న సవాళ్లను సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్‌కు వివరించారు. నిధుల సమీకరణకు ఉన్న మార్గాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
బడ్జెట్ కేటాయింపులు: రాబోయే బడ్జెట్లో ఈ పథకాలకు నిధుల కేటాయింపు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వచ్చే బడ్జెట్ నాటికి ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలపై స్పష్టత ఇవ్వాలని, పథకాల అమలులో జాప్యం జరగకుండా చూడాలని హైకమాండ్ సూచించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి











































































