Vijay-Rashmika: విజయ్ – రష్మిక మ్యారేజ్ లోకేషన్ ప్రత్యేకతలు..!

టాలీవుడ్ స్టార్ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వివాహం చేసుకోబోతున్న నేపధ్యంలో.. ఈ వివాహం జరిగే వేదికపై పెద్ద చర్చ జరుగుతోంది. వివాహం విషయాన్ని పెద్దగా బయటపెట్టకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. వారి వివాహ వేదిక, అతిథుల జాబితా, వేదిక వద్దకు అతిథులను తీసుకెళ్లే లాజిస్టిక్స్ జాతీయ మీడియా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఉదయపూర్(Udaipur) శివార్లలోని ఒక హిల్ రిసార్ట్‌లో వివాహం జరుగుతుందని తెలిపింది.
ఉదయపూర్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఆరావళి పర్వత శ్రేణిలో ఉన్న ఐటీసీ హోటల్స్(ITC Hotels) ఆధ్వర్యంలో నిర్వహించే ది మెమెంటోస్‌లో ఈ వేడుక జరిగే అవకాశం ఉంది. వివాహం విషయంలో ఏ అంశం కూడా బయటకు రాకుండా ఉండేందుకే ఈ హిల్ రిసార్ట్‌ను ఎంచుకున్నారని జాతీయ మీడియా తెలిపింది. రాఫెల్స్ ఉదయపూర్, ఫెయిర్మాంట్ హోటల్స్ కూడా వారి లిస్టు లో ఉన్నట్లు తెలిపింది. ఈ ఆస్తులన్నీ నగరానికి దూరంగా ఉన్నాయట. కొండలలో లేదా ఉదయ్ సాగర్ లేక్ పై ఉన్నట్లు జాతీయ మీడియా ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
ది మెమెంటోస్ గురించి ఒకసారి చూస్తే.. ఐటీసి హోటల్స్ వారి ఈ డెస్టినేషన్ కైలాష్‌పురి అనే గ్రామంలోని నాథ్‌ద్వారా మందిరం, పురాతన ఏక్లింగ్ జీ ఆలయం మధ్య ఓల్డ్ రోడ్ లో ఉంది. హెలిప్యాడ్ ఉన్న హోటల్లో ల్యాండ్ కావడానికి హెలికాప్టర్ సర్వీస్ కూడా వాడుకునే అవకాశం ఉంది. ఈ అల్ట్రా-లగ్జరీ హోటల్లో 117 సూట్లు, విల్లాలు ఉన్నాయి. ఇది కొండపై ఉండటంతో ఆరావళి రేంజ్ లోని ఇతర కొండలు, వ్యూ పాయింట్స్ కనపడే అవకాశం ఉంది. అలాగే మానవ నిర్మిత సరస్సు కూడా ఒకటి ఉందట. ఇందులో ఐదు రెస్టారెంట్లు, మూడు డైనింగ్ హాల్స్, వేడుకలు చేసుకునేందుకు ప్రత్యేక వేదికలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 24, 25 తేదీలలో జరిగే ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లకు గెస్ట్ లు 23వ తేదీ నుంచి వెళ్ళే అవకాశం ఉంది.











































































